Ap News: భారత్‌బంద్‌కు వైకాపా మద్దతివ్వడం అనైతికం: సోము వీర్రాజు
eenadu telugu news
Published : 26/09/2021 15:31 IST

Ap News: భారత్‌బంద్‌కు వైకాపా మద్దతివ్వడం అనైతికం: సోము వీర్రాజు

అమరావతి: వామపక్షాలు, కాంగ్రెస్‌, రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారతబంద్‌కు వైకాపా ప్రభుత్వం మద్దతు పలకడం పట్ల భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రధాన సమస్యలను గాలికొదిలేశారని.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అయోమయంగా ఉన్న ఈ నమయంలో ప్రజల దృష్టిని మళ్లించడానికే బంద్‌కు వైకాపా మద్దతు ప్రకటించిందని విమర్శించారు. రైతు చట్టాల గురించి మాట్లాడేవారంతా అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సంక్షేమం, పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం, వ్యవసాయ ఉత్పత్తులు దేశంలో ఏ ప్రాంతాల్లో నైనా నేరుగా అమ్ముకునే విధంగా కేంద్ర ప్రభుత్వం రైతు చట్టాలను తీసుకొచ్చిందన్నారు. దళారీల బారినుంచి రైతులను రక్షించేందుకు చట్టాలు తీసుకువస్తే.. సంస్కరణలు స్వాగతించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు విరుద్ధంగా, అవకాశవాద రాజకీయాలు చేస్తోందన్ని మండిపడ్డారు.

విదేశీ, కార్పొరేట్ సంస్థల సహకారంతో నడిపిస్తున్న కృత్రిమ ఉద్యమానికి మద్దతివ్వడం వైకాపా ప్రభుత్వ అవకాశవాద విధానాలకు నిదర్శనమని మండిపడ్డారు. స్వార్థ రాజకీయాల కోసం భారత్ బంద్‌కు పిలుపునిస్తే, వైకాపా మద్దతు ఉంటుందని మంత్రి పేర్ని నాని పేర్కొనడం అనైతికమన్నారు. నష్టాల్లో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, వాటిలో పనిచేసే సిబ్బంది ప్రయోజనాలను పరిరక్షించేందుకే వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుందన్నారు. వైకాపా, తెలుగుదేశం పార్టీలకు దీనిపై మాట్లాడే అర్హత లేదని సోము వీర్రాజు మండిపడ్డారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని