కారు ఢీకొని యువకుడి దుర్మరణం
eenadu telugu news
Published : 28/09/2021 03:21 IST

కారు ఢీకొని యువకుడి దుర్మరణం

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కారు ఢీకొన్న ఘటనలో యువకుడు మృతి చెందిన సంఘటన చెన్నై-కోల్‌కత జాతీయ రహదారిపై ఉంగుటూరు మండలం పెద్దఅవుటపల్లి వద్ద సోమవారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా కొల్లూరు గాంధీనగర్‌ కాలనీకి చెందిన మదమంచి సాయికుమార్‌(24), మాగంటి మధుబాబు వరుసకు బావా బామర్దులు. ఇద్దరూ హనుమాన్‌జంక్షన్‌ సమీపంలోని పెదపాడు మండలం కుదరవల్లిలో చేపల చెరువు వద్ద కాపాలాదారులుగా జీవనం సాగిస్తున్నారు. చెరువుల వద్ద నడవడం ఇబ్బందిగా ఉందని కుటుంబ సభ్యులతో చెప్పి ఆదివారం రాత్రి కొల్లూరు నుంచి సైకిల్‌ పట్టుకుని ద్విచక్ర వాహనంపై కుదరవల్లి బయలుదేరారు. మార్గమధ్యలోని పెద్దఅవుటపల్లి చేరుకొనే సరికి మంగళగిరి మండలం నిడమర్రుకు చెందిన కొల్లి ప్రతాపరెడ్డి కారు.. వీరి ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొంది. తీవ్రంగా గాయపడ్డ సాయికుమార్‌ అక్కడికక్కడే మృతి చెందగా.. మధుబాబు పరిస్థితి విషమంగా ఉంది. ఆత్కూరు పోలీసులు క్షతగాత్రుడ్ని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని