పెండింగ్‌ అర్జీలు త్వరగా పరిష్కరించండి
eenadu telugu news
Published : 28/09/2021 03:21 IST

పెండింగ్‌ అర్జీలు త్వరగా పరిష్కరించండి

ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తున్న జేసీ శ్రీధర్‌రెడ్డి

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా సంయుక్త కలెక్టర్‌ కె.శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని ఎస్‌.ఆర్‌.శంకరన్‌ హాలులో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. జేసీ శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ స్పందన అర్జీలను నూరుశాతం నిర్దేశించిన సమయం లోగా పరిష్కరించాలన్నారు. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న వాటిని ఆయా శాఖల అధికారులు త్వరగా పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. మొత్తం 34 అర్జీలు అందినట్లు జేసీ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌వో పి.కొండయ్య, డ్వామా పీడీ శ్రీనివాసరెడ్డి, డీఈవో గంగాభవాని, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ మధుసూదనరావు, తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని