కాపు కార్పొరేషన్‌కు నిధులు కేటాయించాలి
eenadu telugu news
Published : 28/09/2021 03:20 IST

కాపు కార్పొరేషన్‌కు నిధులు కేటాయించాలి

సమావేశంలో పాల్గొన్న నాయకులు

కృష్ణలంక, న్యూస్‌టుడే: కాపు కార్పొరేషన్‌కు తక్షణం నిధులు కేటాయించాలని ఐక్య కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు బేతు రామ్మోహన్‌ డిమాండ్‌ చేశారు. కాపు సంఘాల రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని కృష్ణలంక నెహ్రూనగర్‌లో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కాపు కల్యాణ మండపాలు నిర్మించి, వాటికి అమరులైన కాపు పెద్దల పేర్లు పెట్టాలన్నారు. విదేశీ విద్యా దీవెన పథకాన్ని కొనసాగించాలని, ఎంఎస్‌ఎంఈ గ్రూపు రాయితీ రుణాలు ఇవ్వాలని, ఆర్థికంగా ప్రోత్సహించాలని సూచించారు. చిరు వ్యాపారులకు రాయితీ రుణాలు అందించి, గ్రూప్‌ 1, 2 విద్యార్థులకు ఉచితంగా కోచింగ్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కాపుల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని, లేని పక్షంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాలని సమావేశంలో తీర్మానించారు. కూడేటి జలచంద్రరావు, కాపు జేఏసీ డాక్టర్‌ రావూరి, డీఆర్‌ఎం నాయుడు, కబాడీ శ్రీను, అమరావతి కాపునాడు అధ్యక్షుడు వన్నెంరెడ్డి రాధాకృష్ణ, గిద్ద శ్రీనివాస్‌, మేటిశెట్టి గంగా మహేశ్వరరావు, సతీష్‌, ముత్యాల రమేష్‌, అమృతకళ పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని