‘పట్టాభి.. నోరు అదుపులో పెట్టుకో’
eenadu telugu news
Published : 28/09/2021 03:20 IST

‘పట్టాభి.. నోరు అదుపులో పెట్టుకో’

గాంధీనగర్‌(విజయవాడ), న్యూస్‌టుడే : తెదేపా నేత కొమ్మారెడ్డి పట్టాభి నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన గుణపాఠం తప్పదని వైకాపా నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్‌ హెచ్చరించారు. ఇటీవల తెలంగాణ సరిహద్దులో దొరికిన గంజాయి విషయంలో జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కుటుంబంపై నిరాధార ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సోమవారం విజయవాడ ప్రెస్‌ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో భవకుమార్‌ మాట్లాడారు. పార్టీలకతీతంగా ప్రజలకు సేవలు అందించే సామినేని కుటుంబంపై నిందలు వేస్తే సహించేది లేదన్నారు. నార్కో ఎనాలిస్‌ పరీక్షకు, ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు అయినా వస్తానని ప్రభుత్వ విప్‌ ఉదయభాను సవాల్‌ విసిరారని... దీనికి చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్‌, బ్రాహ్మణీలు సిద్ధమా అంటూ ఆయన ప్రశ్నించారు.  కేడీసీసీ బ్యాంకు ఛైర్మన్‌ తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ.. పట్టాభి ఒక జూనియర్‌ ఆర్టిస్టు అని, ఇలాంటి ఆరోపణలు చేసే అతడి నాలుక కోసినా తప్పులేదన్నారు.  నందిగామ జడ్పీటీసీ జి.వెంకటేశ్వరరావు(బాబు), పెనుగంచిప్రోలు ఎంపీటీసీ మార్కుపూడి గాంధీ, ఎం.ఎస్‌.నారాయణ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని