దేవాలయాల్లో ప్రాచీన సంస్కృతి పునురుద్ధరణే లక్ష్యం
eenadu telugu news
Published : 28/09/2021 03:20 IST

దేవాలయాల్లో ప్రాచీన సంస్కృతి పునురుద్ధరణే లక్ష్యం

ధర్మపథం కార్యక్రమంలో చిన్నారుల నృత్యం

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: దేవాలయాల్లో ప్రాచీన సంస్కృతి, కళా వైభవ పునరుద్ధరణ ప్రభుత్వ లక్ష్యమని ఆ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్‌ సురేష్‌బాబు అన్నారు. హిందూ దేవాలయాల్లో ధర్మపథం కార్యక్రమ ప్రారంభోత్సవంలో భాగంగా ఇంద్రకీలాద్రిపై సాంస్కృతిక కార్యక్రమాలను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వర్చువల్‌ విధానంలో తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్జేసీ సురేష్‌బాబు మాట్లాడుతూ ఆలయాల్లో ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి సూచనలకు అనుగుణంగా ధర్మపథాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. నృత్య, సాంస్కృతిక, యోగ కార్యక్రమాలను క్రమం తప్పకుండా ప్రధాన దేవాలయాల్లో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. బుర్రకథ, హరికథ, కూచిపూడి వంటి కళలు భావితరాలకు అందించే విధంగా కార్యాచరణ రూపొందిస్తుందన్నారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారుల ప్రదర్శించిన సాంస్కృతిక కళారూపాలు, యోగాసనాలు, ఆహుతులను ఆకట్టుకున్నాయి. దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్‌ సోమినాయుడు, డీసీ విజయరాజు, ఏసీ సత్యనారాయణ, ఈఈ భాస్కర్‌, వైదిక కమిటీ సభ్యులు శ్రీనివాసశాస్త్రి, షణ్ముఖశాస్త్రి పలు దేవస్థానాల ఈఓలు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని