దూరవిద్య పీజీ పరీక్షలు వాయిదా
eenadu telugu news
Published : 28/09/2021 03:20 IST

దూరవిద్య పీజీ పరీక్షలు వాయిదా

మాచవరం, న్యూస్‌టుడే : మాచవరం ఎస్సారార్‌ అండ్‌ సీవీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రాంతీయ అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 28 నుంచి జరగాల్సిన పీజీ మొదటి సంవత్సరం పరీక్షలు వాయిదా పడ్డాయని సహాయ సంచాలకుడు డాక్టర్‌ ఎం.అజంతకుమార్‌ తెలిపారు. వర్షాల కారణంగా ఈ నెల 28, 29 తేదీల్లో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. మిగిలిన పరీక్షలు యథావిధిగా జరుగుతాయని, విద్యార్థులు గమనించాలని ఆయన సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని