బీఆర్టీఎస్‌ రహదారిలో కారు బీభత్సం
eenadu telugu news
Published : 28/09/2021 03:20 IST

బీఆర్టీఎస్‌ రహదారిలో కారు బీభత్సం

ఘటనలో ధ్వంసమైన కారు

సత్యనారాయణపురం, న్యూస్‌టుడే : సత్యనారాయణపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధి భానూనగర్‌ ప్రాంతంలో బీఆర్టీఎస్‌ రహదారిపై సోమవారం రాత్రి కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంతో వెళ్తూ మరో మూడు వాహనాలను ఢీకొట్టుకుంటూ వెళ్తి.. డివైడర్‌ అవతలి వైపు ఆగింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌ మంత్రి అప్పలనాయుడుకు(46) తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. సత్యనారాయణపురం పోలీసులు, మూడో ట్రాఫిక్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.... సత్యనారాయణపురం వైపు నుంచి గుణదల వైపు వెళ్తున్న కారు భానూనగర్‌ ప్రాంతంలో ముందు వెళ్తున్న ఆటోను ఢీకొట్టగా అది బోల్తా పడింది. అలాగే పక్కనే నిలిపి ఉన్న ద్విచక్ర వాహనాలను, ముందువెళ్తున్న మరో కారును ఢీకొంది. ఈ సంఘటనలో ఆటో డ్రైవర్‌ అప్పలనాయుడు తీవ్రంగా గాయపడ్డాడు. మరో కారు వెనుక భాగం నుజ్జయింది. ప్రమాదానికి కారణమైన కారు ముందుభాగం నుజ్జయి బెలూన్లు తెరుచుకున్నాయి. కారు అత్యంత వేగంగా వచ్చిందని, డ్రైవరు మద్యం తాగి ఉన్నట్లు స్థానికులు తెలిపారు. కారు యజమాని ఔటుపల్లి రమేష్‌ బాబును పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కారును స్టేషన్‌కు తరలించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని