వానకు తడుస్తూ.. చలికి వణుకుతూ..
eenadu telugu news
Published : 28/09/2021 03:20 IST

వానకు తడుస్తూ.. చలికి వణుకుతూ..

విజయవాడ నగరంలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. కదలలేని అభాగ్యులు.. తడిసిపోతూ, వణుకుతూ లోబ్రిడ్జి సమీపంలోనే అచేతనంగా ఉండిపోయారు. విషయం తెలుసుకున్న 52వ డివిజన్‌ తెదేపా కార్పొరేటర్‌ ఉమ్మడి వెంకటేశ్వరరావు అక్కడికి వెళ్లారు. 108 వాహనానికి ఫోన్‌ చేశారు. వాహనం వచ్చే వరకూ అభాగ్యులు తడవకుండా గొడుగుపట్టారు. వాహనం రాగానే అనుచరుల సాయంతో అందులోకి ఎక్కించారు. అభాగ్యుల దుస్తులు మార్చారు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిని ఆశ్రమానికి చేరుస్తానని కార్పొరేటర్‌ వెంకటేశ్వరరావు తెలిపారు.

- ఈనాడు, అమరావతి  


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని