లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తం
eenadu telugu news
Published : 28/09/2021 03:20 IST

లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తం

కృష్ణలంక, న్యూస్‌టుడే: తుపాను నేపథ్యంలో జిల్లాలో వర్షాలు కురుస్తున్నందున  లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ జె.నివాస్‌ సూచించారు. అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. క్యాంపు కార్యాలయం నుంచి సోమవారం సబ్‌ కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలు, మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ వర్షాలు తగ్గుముఖం పట్టే వరకూ అప్రమత్తంగా ఉండాలన్నారు. తీరప్రాంత గ్రామాలు, లోతట్టు ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షించాలని సూచించారు. ఏ మండలంలోనైనా రోడ్లు, ఇరిగేషన్‌ ట్యాంకులు, గృహాలకు నష్టం వాటిల్లితే వెంటనే నివేదిక అందజేయాలన్నారు. జిల్లాలో గత 24 గంటల్లో 44.4 మి.మీ. సగటు వర్షపాతం నమోదైందని, అత్యధికంగా జి.కొండూరు మండలంలో 178.0 మి.మీ. వర్షం కురవగా, అత్యల్పంగా ఘంటసాల మండలంలో 5.2 మి.మీ. పడిందని తెలిపారు. కొత్త పింఛన్లు, వివిధ కారణాలతో నిలిచిన పింఛన్ల పరిశీలను ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పారు. జేసీలు కె.మాధవీలత, ఎల్‌.శివశంకర్‌, కె.మోహన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.  

గులాబ్‌ తుపాను ప్రభావిత ప్రాంతాల జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న నివాస్‌ మాట్లాడుతూ జిల్లాలో జి.కొండూరు మండలంలో ఒక రోడ్డు కోతకు గురవగా, మిగిలిన చోట్ల సాధారణ పరిస్థితులు ఉన్నాయని చెప్పారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని