బ్యారేజీ 10 గేట్లమూసివేత
eenadu telugu news
Published : 15/10/2021 03:19 IST

బ్యారేజీ 10 గేట్లమూసివేత

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : కృష్ణా నది వరద ప్రవాహం గురువారం తగ్గుముఖం పట్టింది. ప్రకాశం బ్యారేజీ వద్ద 10 గేట్లను మూసివేశారు. మిగతా 60 గేట్లను ఒక అడుగు మేర ఎత్తారు. సముద్రంలోకి 44,520 క్యూసెక్కులు విడుదల చేశారు. ఉదయం 6 గంటలకు ఎగువ నుంచి బ్యారేజీకి 67,579 క్యూసెక్కుల మేర వరద రాగా, 70 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి సముద్రంలోకి 51,800 క్యూసెక్కులు, కాల్వలకు 15,779 క్యూసెక్కులు విడుదల చేశారు. ఉదయం 9 గంటలకు వరద ప్రవాహం 60,299 క్యూసెక్కులకు తగ్గడంతో పది గేట్లను మూసి వేశారు. మిగతా 60 గేట్లను అడుగు మేర ఎత్తి, 44,520 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేశారు. సాయంత్రం 6 గంటల వరకు ఇదే పరిస్థితి కొనసాగింది.

కాల్వలకు 15,973 క్యూసెక్కులు..

సాయంత్రం 6 గంటలకు ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా డెల్టాలోని పంట కాల్వలకు 15,973 క్యూసెక్కులు విడుదల చేశారు. కృష్ణా తూర్పు (కేఈ) ప్రధాన కాల్వకు 8900, కృష్ణా పశ్చిమ (కేడబ్ల్యూ) ప్రధాన కాల్వకు 6830, గుంటూరు ఛానల్‌కు 243 క్యూసెక్కుల మేర ఇస్తున్నారు. కేఈ ప్రధాన కాల్వ నుంచి రైవస్‌ కాల్వకు 3794, బందరు కాల్వకు 2311, కేఈబీ కాల్వకు 1443, ఏలూరు కాల్వకు 1352 క్యూసెక్కుల చొప్పున విడుదల చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని