జయ జయహే జననీ
eenadu telugu news
Published : 15/10/2021 03:19 IST

జయ జయహే జననీ

- ఈనాడు, అమరావతి

అమ్మవారికి హారతి ఇస్తున్న అర్చకుడు

ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా గురువారం మహిషాసురమర్దినీదేవిగా దుర్గమ్మ దర్శనమిచ్చింది. ఉదయం నుంచి రాత్రి వరకు 15వేల మంది వరకు భక్తులు దర్శించుకున్నారు. చివరి రోజు కావడంతో భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని భావించి, ట్రాఫిక్‌ ఆంక్షలను కూడా పెట్టినట్టు విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ బి.శ్రీనివాసులు వెల్లడించారు. తెప్పోత్సవం సందర్భంగా కనకదుర్గ పైవంతెనపై ట్రాఫిక్‌ను నిలిపేస్తున్నట్టు తెలిపారు. దుర్గాఘాట్‌ నుంచి కుమ్మరిపాలెం జంక్షన్‌ వరకు ఎలాంటి వాహనాలను అనుమతించడం లేదన్నారు. తెప్పోత్సవాన్ని వీక్షించడానికి అనుమతి ఉన్న వారికే ప్రవేశం ఉంటుందని తెలిపారు.

సువాసినీ పూజ అనంతరం బాలికలకు నమస్కరిస్తున్న రుత్వికుడు

గంగా పార్వతీ సమేత దుర్గామల్లేశ్వరస్వామి ఉత్సవమూర్తుల ఊరేగింపు


 

కుంకుమ పూజలో దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి వాణీ మోహన్‌

తరలివచ్చిన భవానీలు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని