నేడు నగరంలో ట్రాఫిక్‌ మళ్లింపు
eenadu telugu news
Published : 15/10/2021 03:19 IST

నేడు నగరంలో ట్రాఫిక్‌ మళ్లింపు

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే : దేవీశరన్నవరాత్రులలో భాగంగా శుక్రవారం కృష్ణా నదిలో దుర్గమ్మ తెప్పోత్సవాన్ని నిర్వహించనున్న నేపథ్యంలో ట్రాఫిక్‌ మళ్లిస్తున్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ బి.శ్రీనివాసులు తెలిపారు. దుర్గాఘాట్‌, ప్రకాశం బ్యారేజీ పరిసర ప్రాంతాలలో సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు ఆర్టీసీ బస్సులను దారి మళ్లిస్తున్నట్లు తెలిపారు.

* పండిట్‌ నెహ్రూ బస్టేషన్‌ నుంచి హైదరాబాద్‌, తిరువూరు, జగ్గయ్యపేట వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సులను కనకదుర్గ పైవంతెన పైకి అనుమతించరు.  

* కుమ్మరిపాలెం వైపు నుంచి ఘాట్‌ రోడ్డు మీదుగా కాళేశ్వరరావు మార్కెట్‌, మార్కెట్‌ నుంచి కుమ్మరిపాలెం వైపునకు ఏ విధమైన వాహనాలు అనుమతించరు. కుమ్మరిపాలెం నుంచి వచ్చే కార్లు, ద్విచక్ర వాహనాలను సితారా వైపు నుంచి చిట్టినగర్‌ వైపునకు మళ్లిస్తారు.

* తాడేపల్లి వైపు నుంచి ప్రకాశం బ్యారేజీ మీదుగా విజయవాడ, విజయవాడ నుంచి తాడేపల్లి వైపు వెళ్లే వాహనాల రాకపోకలను పరిస్థితులకు అనుగుణంగా నియంత్రిస్తారు.

* పీసీఆర్‌ వైపు నుంచి వినాయక గుడి వైపునకు పైవంతెన మీదుగా ఎటువంటి వాహనాలను అనుమతించరు.  

* తెప్పోత్సవం జరిగే సమయాల్లో భక్తులు, ప్రజల వాహనాలను కనకదుర్గ పైవంతెన మీద అనుమతించరు.

సిటీ బస్సుల రాకపోకలు ఇలా...

* పండిట్‌ నెహ్రూ బస్టేషన్‌ (పీఎన్‌బీఎస్‌) నుంచి హైదరాబాద్‌, తిరువూరు, జగ్గయ్యపేట వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సులు పీసీఆర్‌-ఆర్టీసీ వై జంక్షన్‌, ఏలూరు రోడ్డు, చల్లపల్లి బంగ్లా, ఏలూరు లాకులు, జీఎస్‌రాజు రోడ్డు, బుడమేరు వంతెన, సింగ్‌నగర్‌ పైవంతెన మీదుగా పైపుల రోడ్డు, వైవీరావు ఎస్టేట్‌, సీవీఆర్‌ పై వంతెన మీదుగా కబేళా, సీతారా సెంటర్‌, గొల్లపూడి బైపాస్‌ మీదుగా ఇబ్రహింపట్నం వైపు మళ్లిస్తారు.

* పీఎన్‌బీఎస్‌ నుంచి ఇబ్రహింపట్నం వెళ్లాల్సిన ఆర్టీసీ, సిటీ బస్‌లు, ఇతర వాహనాలు పీసీఆర్‌లో బ్రిడ్జి, కాళేశ్వరరావు మార్కెట్‌, బీఆర్‌పీ రోడ్డు, పంజాసెంటర్‌, వీజీ చౌక్‌, చిట్టినగర్‌, సొరంగం మీదుగా సితారా సెంటర్‌, గొల్లపూడి బైపాస్‌ మీదుగా ఇబ్రహింపట్నం వైపు మళ్లిస్తారు.  

* ఇబ్రహింపట్నం వైపు నుంచి పండిట్‌ నెహ్రూ బస్టేషన్‌కు వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సులు గొల్లపూడి వై జంక్షన్‌ నుంచి గొల్లపూడి బైపాస్‌ రోడ్డులోకి మళ్లించి సితార సెంటర్‌, కబేళా సెంటర్‌, సీవీఆర్‌ పైవంతెన, చిట్టినగర్‌, పంజా సెంటర్‌, కాళేశ్వరరావు మార్కెట్‌లో లోబ్రిడ్జి, పీసీఆర్‌ మీదుగా బస్టేషన్‌ వెళ్లాలి.

* ప్రకాశం బ్యారేజీ వద్ద భక్తుల రద్దీ ఏర్పడినప్పుడు తాడేపల్లి వైపు నుంచి, విజయవాడ వైపు నుంచి తాడేపల్లి వెళ్లే వాహనాలను పరిస్థితులకు అనుగుణంగా కనకదుర్గమ్మ వారధి వైపునకు మళ్లిస్తారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని