నీటి కుంటలో పడి బాలుడి మృతి
eenadu telugu news
Published : 15/10/2021 03:19 IST

నీటి కుంటలో పడి బాలుడి మృతి

మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఆర్‌ఐ, వీఆర్వో

గ్రామీణ సత్తెనపల్లి, న్యూస్‌టుడే : సత్తెనపల్లి మండలం గుడిపూడి ఎస్టీ కాలనీ పక్కన ఉన్న నీటి కుంటలో ప్రమాదవశాత్తు జారి పడి తోకల అశోక్‌(11) గురువారం మృతి చెందాడు. తాడికొండ మండలం రావెలకు చెందిన తోకల వెంకటేశ్వరమ్మ కొన్నేళ్ల కిందట భర్తతో విభేదించి అమ్మవారి ఉరైన గుడిపూడి వచ్చింది. కుమారుడు అశోక్‌తో కలిసి అద్దె ఇంటిలో ఉంటూ కూలి పనులతో కాలం గడుపుతోంది. రోజు మాదిరిగానే గురువారం ఉదయం ఆమె పనులకు వెళ్లింది. పాఠశాలకు సెలవు కావడంతో స్నేహితులతో అశోక్‌ ఆడుకుంటూ ఇంటికి సమీపంలోని నీటి కుంట వద్దకు చేరారు. అందులో దిగుతూ ప్రమాదవశాత్తు జారి నీటిలో పడ్డాడు. ఈ విషయం ఇరుగు పొరుగుకు చేరి వారు వచ్చి రక్షించే లోపే అతను మృతి చెందాడు. మృతదేహాన్ని ఆర్‌ఐ ఎం.ఏసుదాసు, వీఆర్వో బి.సుబ్బారావు పరిశీలించారు. కూలి పనులు చేస్తూ, కుమారుడిని బడికి పంపుతూ ఉన్నత చదువులు చదివించాలన్న ఆశ నెరవేరలేదని తల్లి బావురుమంది. అంత్యక్రియల నిమిత్తం బాలుడి మృతదేహాన్ని రావెలకు తరలించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని