వామ్మో.. ఇన్ని మందులా?
eenadu telugu news
Published : 15/10/2021 03:19 IST

వామ్మో.. ఇన్ని మందులా?

గుంటూరు వైద్యం: గుంటూరు వైద్య కళాశాల బాలుర వసతి గృహంలో నిల్వ ఉన్న ఔషధాలు చూసి అధికారులు వామ్మో.. ఇన్ని మందులా అంటూ ఆశ్చర్యపోయారు. కేంద్ర ఔషధ భాండాగారంలో ఖాళీ లేక అక్కడ మందులను డంప్‌ చేశారు. వాటిని ప్రిన్సిపల్‌ పద్మావతిదేవి ఇతర ఆచార్యులతో కలిసి గురువారం ఆకస్మికంగా పరిశీలించారు. దీంతో అక్కడ కొన్నేళ్ల నుంచి కుప్పలుగా పడేసిన మందులున్నట్లు గుర్తించారు. అందులో కాలం చెల్లిన ఔషధాలూ ఎక్కువగానే ఉండటం గమనార్హం. వాటిని ధ్వంసం చేయకుండా అక్కడే నిల్వ ఉంచినట్లు తెలుసుకున్నారు. అక్కడ ఔషధాలు, సూదిమందు, శస్త్రచికిత్సలకు వినియోగించే వస్తువులు గదుల నిండా గుట్టలుగా పేర్చారు. ఈ ఔషధాలు ఆంధ్రప్రదేశ్‌ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ అధికారుల పర్యవేక్షణలోనే నిల్వ ఉంచారు. దీని ప్రధాన కార్యాలయం మంగళగిరిలోనే ఉండటం గమనార్హం. ఈ మందులను ఇప్పటికైనా అవసరమైన ఆసుపత్రులకు తరలించాలని, గడువు తీరిన వాటిని ధ్వంసం చేయాలని పలువురు వైద్యులు సూచిస్తున్నారు. దీనిపై ‘ఈనాడు’ ప్రధాన పత్రికలో ఈ నిర్లక్ష్యానికి మందేది? అనే శీర్షికన గత నెల 24 ప్రచురితమైన విషయం విదితమే.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని