AP News: ఫ్యాన్‌కు ఓటేస్తే.. ఇంట్లో ఫ్యాన్ ఆగిపోయింది: నారా లోకేశ్
eenadu telugu news
Updated : 16/10/2021 14:42 IST

AP News: ఫ్యాన్‌కు ఓటేస్తే.. ఇంట్లో ఫ్యాన్ ఆగిపోయింది: నారా లోకేశ్

అమరావతి: ఏపీలో ప్రజలు ఫ్యాన్‌ గుర్తుకు ఓటేస్తే ఇంట్లో ఫ్యాన్‌ ఆగిపోయిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని జగన్ అంధకారంధ్రప్రదేశ్‌గా మార్చారని విమర్శించారు. రాష్ట్రంలో విధిస్తున్న విద్యుత్‌ కోతల గురించి ఆయన ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘‘ఓ వైపు విద్యుత్‌ ఛార్జీల పెంపు పేరుతో ప్రజలపై భారం మోపుతున్నారు. మరో వైపు విద్యుత్‌ కొరతతో అంధకారంలో ఉండాల్సిన పరిస్థితి. బొగ్గు కొరత ఏర్పడుతుందని 40 రోజుల ముందే కేంద్ర ప్రభుత్వం హెచ్చరించినా సీఎం జగన్‌లో చలనం లేదు. బొగ్గు ఉత్పత్తి సంస్థలకు చెల్లించాల్సిన రూ.215 కోట్ల బకాయిలు చెల్లించకపోవడం దారుణం. అవసరం మేర బొగ్గు నిల్వ చేసుకోవాలన్న కేంద్రం హెచ్చరికలను రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టింది’’ అని నారా లోకేశ్‌ ఆరోపించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని