పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తాం
eenadu telugu news
Published : 17/10/2021 03:06 IST

పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తాం

గుంటూరు పార్లమెంటు తెలుగు యువత కమిటీ ప్రకటన

అభివాదం చేస్తున్న రావిపాటి సాయికృష్ణ, ఎల్లావుల అశోక్‌ తదితరులు

పట్టాభిపురం, న్యూస్‌టుడే: తెదేపాకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు తెలుగు యువతను మరింతగా బలోపేతం చేస్తామని గుంటూరు పార్లమెంటు తెలుగుయువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ తెలిపారు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం జయంతి సందర్భంగా జిల్లా తెదేపా కార్యాలయంలో గుంటూరు పార్లమెంట్‌ తెలుగు యువత కమిటీని విడుదల చేశారు. ప్రధానకార్యదర్శిగా నాగుల్‌మీరా, ఉపాధ్యక్షులుగా వెంకటేష్‌, శేఖర్‌బాబు, సత్య హర్ష, బాజి, సురేంద్రబాబు, రాము, రమేష్‌రెడ్డి, అధికార ప్రతినిధులుగా షుకూర్‌, శివకుమార్‌, గోపికృష్ణ, వెంకట్రావు, నాగార్జున, సిభక్తుల్లా, హైమారావు, ప్రదీప్‌ చంద్‌, కార్యనిర్వాహక కార్యదర్శులుగా రషీద్‌, ఖాసిం, కరిముల్లా, శ్రీనివాస్‌, హనుమంతురావు, శ్రీనివాసరావు, ప్రవీణ్‌కుమార్‌, జబియుల్లా మహమ్మద్‌, గణేష్‌, ఆనంద్‌బాబు, ఓంకార్‌, కార్యదర్శులుగా విజయ్‌కాంత్‌, లక్ష్మణ్‌, రాజేష్‌, బాజి, మన్నేష్‌, అతావుల్లఖాన్‌, దాసు, సుధీర్‌కుమార్‌, త్రినాథ్‌, రాజశేఖర్‌ను నియమించామన్నారు. నియోజకవర్గాల తెలుగుయువత అధ్యక్షులుగా భార్గవ్‌ మణిదీప్‌(గుంటూరు పశ్చిమ), షేక్‌ అప్రోజ్‌ (గుంటూరు తూర్పు), వెంకటకృష్ణ (పొన్నూరు), మహేష్‌ (మంగళగిరి), నాగరాజు (ప్రత్తిపాడు), సూర్యకిరణ్‌ తేజ (తెనాలి), అనూప్‌(తాడికొండ)ను నియమించామని వివరించారు. తెలుగుయువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్లావుల అశోక్‌ తదితరులు మాట్లాడారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని