సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య
eenadu telugu news
Published : 17/10/2021 03:06 IST

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య

పట్టాభిపురం, న్యూస్‌టుడే: మానసికంగా కుంగిపోయిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడినట్లు అరండల్‌పేట ఠాణాలో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కొరిటపాడుకు చెందిన నాగసాయి (26) హైదరాబాద్‌లోని గూగుల్‌ శాఖలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఇంటి వద్ద నుంచే పనిచేస్తున్నారు. ఆమె తండ్రి రమేష్‌ ఇటీవల కరోనాతో మృతి చెందారు. అప్పటి నుంచి ఆమె కుంగుబాటులో ఉన్నారు. నాగసాయి తల్లి విజయ బంధువుల ఇళ్ల వద్ద నిద్రల నిమిత్తం వెళుతూ సోదరి కల్యాణిని కుమార్తెకు తోడుగా ఉంచారు. ఈ క్రమంలో నాగసాయి తన గదిలో శనివారం ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీనిపై తల్లి విజయ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని