రికార్డు స్థాయిలో లడ్డూ ప్రసాదం విక్రయం
eenadu telugu news
Updated : 17/10/2021 05:30 IST

రికార్డు స్థాయిలో లడ్డూ ప్రసాదం విక్రయం

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల చివరి రోజున రికార్డు స్థాయిలో 3 లక్షల లడ్డూ ప్రసాదాన్ని విక్రయించారు. మూలా నక్షత్రం రోజు 1.50 లక్షల లడ్డూలను కౌంటరులో విక్రయిస్తే చివరి రోజున ఆ సంఖ్య రెట్టింపు అయింది. ఉత్సవాల సందర్భంగా మొత్తం 12.60 లక్షల లడ్డూలను విక్రయించారు. తొలుత 10 లక్షల లడ్డూలను మాత్రమే తొలుత లక్ష్యంగా చేసుకున్నారు. అనూహ్యంగా భవానీ దీక్షాధారులు రద్దీ ఉండటంతో శనివారం 1.60 లక్షల ప్రసాదాలను నిల్వ ఉంచినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. ఆదివారం మరింత పెరిగితే 1.50 లక్షల లడ్డూలు తయారు చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ప్రత్యేకంగా లడ్డూల తయారీ కేంద్రం వద్ద పర్యవేక్షణకు ఆర్జేసీ స్థాయి అధికారిని నియమించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని