భవానీ దీక్షాధారులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు: కలెక్టర్‌
eenadu telugu news
Published : 17/10/2021 03:18 IST

భవానీ దీక్షాధారులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు: కలెక్టర్‌

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: భవానీ దీక్షాధారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్‌ నివాస్‌ అన్నారు. దీక్షాధారులు పెద్దఎత్తున ఇంద్రకీలాద్రికి తరలివస్తుండటంతో ఘాట్లు, క్యూలైన్లు, వివిధ కౌంటర్ల వద్ద ఏర్పాట్లను అధికారులతో కలిసి కలెక్టర్‌ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా నివాస్‌ మాట్లాడుతూ సీతమ్మవారి పాదాలు, కృష్ణవేణి ఘాట్‌ వద్ద దీక్షాధారులకు ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. దేవస్థానం సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రసాదాల తయారీ కేంద్రాన్ని పరిశీలించి, నాణ్యమైన ప్రసాదాన్ని భక్తులకు అందించాలని చెప్పారు. కౌంటర్ల వద్ద ప్రతి భవానీకి ఐదు లడ్డూలు మాత్రమే ఇవ్వాలని సూచించారు. జేసీ శివశంకర్‌, సబ్‌కలెక్టర్‌ ప్రవీణ్‌చంద్‌, సీఎంహెచ్‌ఓ గీతాబాయి పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని