కోర్టు భవన నిర్మాణ పనుల పరిశీలన
eenadu telugu news
Published : 17/10/2021 03:18 IST

కోర్టు భవన నిర్మాణ పనుల పరిశీలన

జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రాకు పుష్పగుచ్ఛం అందజేసి నమస్కరిస్తున్న

న్యాయమూర్తి శ్యాంసుందర్‌ తదితరులు

విజయవాడ న్యాయవిభాగం, న్యూస్‌టుడే : విజయవాడ న్యాయస్థానాల ప్రాంగణంలో నూతన న్యాయస్థానాల భవన నిర్మాణ పనులను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. భవన నిర్మాణ బిల్డర్‌, ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులతో మాట్లాడుతూ.. నిర్మాణ పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్మాణాల ప్లాన్‌ను పరిశీలించారు. కోర్టు నమూనాను పరిశీలించి, నాణ్యత విషయంలో రాజీపడొద్దని పేర్కొన్నారు. కార్యక్రమంలో మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ న్యాయస్థానం న్యాయమూర్తి శ్యాంసుందర్‌, కలెక్టర్‌ జె.నివాస్‌, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని