నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై ఆర్జిత సేవలు
eenadu telugu news
Published : 18/10/2021 04:30 IST

నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై ఆర్జిత సేవలు

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ముగిసినందున ఈ నెల 18 నుంచి జగన్మాత దుర్గమ్మకు నిర్వహించే అన్ని ఆర్జిత సేవలు యధాతథంగా జరుగుతాయని వైదిక కమిటీ సభ్యుడు, స్థానాచార్య శివప్రసాద శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారని పేర్కొన్నారు. దసరా ఉత్సవాల్లో కేవలం భక్తులకు లక్షకుంకుమార్చన, శత చండీయాగం, శ్రీచక్రనవావరణార్చన సేవలకు మాత్రమే అనుమతించారు. మిగితా ఆర్జిత సేవలు దేవస్థానం రుత్వికులు మాత్రమే నిర్వహించారు. ఉత్సవాలు ముగియడం, భవానీ దీక్షాధారులు కూడా తగ్గినందన మిగతా ఆర్జిత సేవలైన సుప్రభాత సేవ, ఖడ్గమాలార్చన, శాంతి కల్యాణం, రుద్రాభిషేకం, అష్టోత్తరం, సహస్రనామార్చన, రాహుకేతు పూజ, పంచహారతులు వంటి ఆర్జిత సేవల్లో భక్తులు కొవిడ్‌ నిబంధనలు పాటించి పాల్గొనవచ్చన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని