ఆత్మహత్యలకు పాల్పడొద్దు: వైవీబీ
eenadu telugu news
Published : 18/10/2021 04:30 IST

ఆత్మహత్యలకు పాల్పడొద్దు: వైవీబీ

ఉయ్యూరు, న్యూస్‌టుడే: నరేగా పనులు చేసిన ప్రజా ప్రతినిధులు ఎవరూ ఆందోళన చెంది ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ రాజ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి.రాజేంద్రప్రసాద్‌ అన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ పనులు నిర్వహించిన వారికి ఛాంబర్‌ అండదండగా ఉంటుందని, అవసరమైతే నిధులు సాధించుకునేందుకు ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. నరేగా, నీరు, చెట్టు పనులు చేసిన వారికి బిల్లులు ఇవ్వకపోతే సంబంధిత అధికారులకు, పంచాయతీరాజ్‌ రాష్ట్ర కార్యదర్శికి, కమిషనరుకు న్యాయవాదుల ద్వారా నోటీసులు పంపాలన్నారు. కోర్టు ధిక్కార కేసు దాఖలు చేస్తామన్నారు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా నిధుల విడుదలలో నిర్లక్ష్యం తగదన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి వలనే పనులు చేసేందుకు గుత్తేదారులు టెండర్లు వేయడం లేదని వైవీబీ గుర్తుచేశారు. కేంద్రం నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం సొంత అవసరాలకు వాడుకోవడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని