‘రాయలసీమకు వైకాపా, భాజపాల ద్రోహం’
eenadu telugu news
Published : 18/10/2021 04:30 IST

‘రాయలసీమకు వైకాపా, భాజపాల ద్రోహం’

గవర్నర్‌పేట: వైకాపా, భాజపాలు రాయలసీమకు ద్రోహం చేసిన పార్టీలని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్‌ ఎన్‌.తులసిరెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో విమర్శించారు. కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికలో ఈ రెండు పార్టీలకు ఓటర్లు బుద్ధి చెప్పాలని కోరారు. రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా రాకపోవటానికి ఈ రెండు పార్టీలే కారణమని ఆయన ఆరోపించారు. బుందేల్‌ఖండ్‌ తరహా అభివృద్ధి ప్యాకేజీలు రాకపోవటానికి, కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం రాకపోవటానికి, కడప-మదనపల్లి-బెంగళూరు కొత్త రైలు మార్గం రాకపోవటానికి ఈ రెండు పార్టీలే కారణమని విమర్శించారు. రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్లాంటును 18 నెలల పాటు వైకాపా ప్రభుత్వం మూసివేయటం శోచనీయమన్నారు. కృష్ణాబోర్డు కార్యాలయాన్ని రాయలసీమలో కాకుండా విశాఖలో పెట్టాలని జగన్‌ ప్రభుత్వం లేఖ రాయటం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేస్తే కరెంటు లేక ఇంట్లో ఫ్యాన్‌ తిరగదని తులసిరెడ్డి పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని