పర్వతారోహణలో యువకుడి సత్తా
eenadu telugu news
Published : 18/10/2021 04:38 IST

పర్వతారోహణలో యువకుడి సత్తా


పర్వతారోహణ అనంతరం నాగరాజు ఉత్సాహం

రేగిడి, న్యూస్‌టుడే: శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలంలోని ఉనుకూరు గ్రామానికి చెందిన మెరుగుల నాగరాజు పర్వతారోహణలో సత్తా చాటాడు. సిక్కిం రాష్ట్రంలో 5,450 మీటర్ల ఎత్తుగల లఖఖన్సయ్‌ పర్వతాన్ని అధిరోహించి శభాష్‌ అనిపించుకున్నాడు. దీంతో ఆ రాష్ట్రప్రభుత్వం బంగారు పతకంతో పాటు ఉత్తమ అధిరోహకుడు, ఉత్తమ మారథాన్‌ పురస్కారంతో సత్కరించింది. నాగరాజు ప్రస్తుతం విజయవాడలోని విశాఖ కాలేజ్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కళాశాలలో బీపీఈడీ చదువుతున్నాడు. ఉత్తర సిక్కింలోని బేస్‌ క్యాంపు నుంచి సెప్టెంబరు 24న పర్వతారోహణ ప్రారంభించి ఈ నెల 2వ తేదీన లక్ష్యాన్ని చేరుకున్నాడు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి మొత్తం 42 మంది బయలుదేరినట్లు నాగరాజు ‘న్యూస్‌టుడే’కు వివరించాడు. అక్టోబరు 2న మధ్యాహ్న 2 గంటలకు పర్వతం శిఖరం చేరుకున్నట్లు చెప్పాడు. ఎవరెస్టును అధిరోహించడమే లక్ష్యమని స్పష్టం చేశాడు. ఇతని తండ్రి మరణించగా తల్లి కష్టపడి చదివిస్తోంది. పర్వతారోహణలో సత్తాచాటిన నాగరాజును గ్రామస్థులు అభినందించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని