రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 8 మందికి గాయాలు
eenadu telugu news
Published : 18/10/2021 04:56 IST

రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 8 మందికి గాయాలు


క్షతగాత్రులను 108 వాహనంలో తరలిస్తున్న దృశ్యం

చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే : చిలకలూరిపేట పట్టణ, మండల పరిధిలో జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో 8 మందికి గాయాలయ్యాయి. చిలకలూరిపేట బస్టాండ్‌ దాటాక శ్మశానం ఎదురుగా ప్రార్థనకు వెళ్లి ఆటోలో వస్తున్న వారిని గుంటూరు నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న కారు వేగంగా ఢీకొట్టింది. ఆటోలో ఉన్న జి.శబిరియులు, అక్షయ, ప్రసన్న, విజయ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని 108లో చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చిలకలూరిపేట మండలం బొప్పూడి- తాతపూడి మధ్య అనంతవరం క్రాస్‌ వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో రామచంద్రాపురం గ్రామానికి చెందిన ఇజ్రాయిల్‌, మార్తమ్మ, కీర్తన, ప్రేమానందమ్మకు గాయాలయ్యాయి. వీరికి 108 సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించి ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని