అమ్మ ఒడి పథకానికి ఆంక్షలు: ఆనందబాబు
eenadu telugu news
Published : 18/10/2021 04:56 IST

అమ్మ ఒడి పథకానికి ఆంక్షలు: ఆనందబాబు

పట్టాభిపురం, న్యూస్‌టుడే: ఏ పథకమైనా ప్రజలను ఊరించి ఉసూరుమనిపించడం సీఎం జగన్‌కే సాధ్యమని, అమ్మ ఒడి పథకాన్ని ఆంక్షల సుడిగా మార్చారని మాజీ మంత్రి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు మండిపడ్డారు. ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి అమ్మ ఒడిని అమలు చేస్తామని మాట ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారు. 84 లక్షల మంది విద్యార్థులుంటే.. ఈ ఏడాది 44 లక్షల మంది విద్యార్థులకు మాత్రమే వర్తింపజేస్తూ సగం మంది అమ్మలను మోసం చేస్తున్నారు. పిల్లల సంఖ్యను కుదించేందుకు ఏడు రకాల ఆంక్షలు విధించారు. ప్రస్తుతం 75 శాతం హాజరును బూచిగా చూపి అమ్మఒడిని అమలు చేయలేకపోతున్నామని చెప్పడం హేయం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల పేద విద్యార్థులు నష్టపోతారు. రంగులు వేయడం, సలహాదారుల నియామకాలకు పెట్టే ఖర్చుతో అమ్మ ఒడి పథకాన్ని కొనసాగించవచ్చు’.. అని పేర్కొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని