ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు ప్రారంభం
eenadu telugu news
Published : 18/10/2021 05:02 IST

ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు ప్రారంభం


తలపడుతున్న క్రీడాకారులు

గుంటూరు క్రీడలు, న్యూస్‌టుడే: జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో బీఆర్‌ స్టేడియంలో జిల్లా స్థాయి ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఎనిమిది జట్లు పోటీలకు హాజరయ్యాయి. మేడికొండూరు, ముప్పాళ్ల జట్ల మధ్య ప్రారంభ మ్యాచ్‌ను జిల్లా అధ్యక్షుడు క్రాంతికుమార్‌, కార్యదర్శి దుర్గామోహన్‌ ప్రారంభించారు. ముప్పాళ్ల జట్టు 7-0 స్కోరుతో మేడికొండూరు జట్టుపై విజయం సాధించింది. పేరేచర్ల-పెదకాకాని జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పేరేచర్ల జట్టు 1-0 స్కోరుతో విజయం సాధించింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని