భార్య గొంతు కోసిన భర్త
eenadu telugu news
Published : 19/10/2021 04:07 IST

భార్య గొంతు కోసిన భర్త

అమరావతి, న్యూస్‌టుడే: భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెపై దాడి చేసి గొంతు కోసిన ఘటన మండల కేంద్రమైన అమరావతిలో చోటుచేసుకుంది. అమరావతి ఎస్సై కోటేశ్వరరావు కథనం ప్రకారం.. లింగాపురానికి చెందిన షేక్‌ బాజికి, పెనుగంచిప్రోలుకు చెందిన షేక్‌ సాధికకు 10 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ముగ్గురు మగ సంతానం. కొన్ని రోజులుగా దంపతులు అమరావతిలో కాపురం ఉంటున్నారు. బాజి స్థానిక  సత్తెనపల్లి అమరావతి ప్రధాన రహదారి వెంట సోడా బండి నడుపుతున్నాడు. కొంత కాలంగా భార్యను అనుమానిస్తూ ఆమెను తరచూ వేధిస్తున్నాడు. ఆదివారం పొద్దుపోయాక సాధికతో.. బాజి గొడవకు దిగాడు. ఆవేశంతో ఇంట్లో ఉన్న చాకుతో భార్యపై దాడి చేసి గొంతు కోశాడు. దీంతో ఇరుగు పోరుగు వారు, బంధువులు అక్కడకు చేరుకొని ఆమెను అమరావతి సీహెచ్‌సీకి తరలించారు. అనంతరం డాక్టర్ల సూచన మేరకు మెరుగైన వైద్యం నిమిత్తం సాధికను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు చెప్పారు. నిందితుడు బాజి పరారీలో ఉన్నాడు. పోలీసులు సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని