తండ్రిని చంపిన తనయుడు
eenadu telugu news
Published : 19/10/2021 04:02 IST

తండ్రిని చంపిన తనయుడు

పాపయ్య మృతదేహం

తాడికొండ, న్యూస్‌టుడే: ఆస్తి రాయలేదన్న కోపంతో తండ్రిని కొడుకు చంపిన ఘటన మండలంలోని బండారుపల్లి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన కళ్లే పాపయ్య (85)కు ఐదుగురు కూతుళ్లు, విరాంజీ, నారాయణ అనే ఇద్దరు కొడుకులున్నారు. అందరికీ వివాహం చేసిన పాపయ్య గ్రామంలో తనకున్న పది సెంట్ల స్థలంలో ఇద్దరు కొడుకులకు ఇళ్లు నిర్మించారు. వాటిని తన పేరుపైనే ఉంచుకున్నారు. తన వాటా ఇంటిని తన పేరుపై రాయాలని కొంత కాలంగా చిన్న కొడుకు నారాయణ తండ్రితో తరచూ గొడవపడేవాడు. ఆయన ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో సోమవారం మద్యం తాగి ఇంటికి వచ్చిన నారాయణ తండ్రితో ఘర్షణకు దిగి గట్టిగా కొట్టి కిందికి నెట్టేశాడు. ఆ దెబ్బకు తాళలేక పాపయ్య అక్కడికక్కడే చనిపోయారు. ఎస్సై వెంకటాద్రి ఘటనా స్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. నిందితుడిని అదుపులో తీసుకున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని