బాలికపై బాలుడి అత్యాచారం
eenadu telugu news
Updated : 19/10/2021 05:25 IST

బాలికపై బాలుడి అత్యాచారం

చిట్టినగర్‌, న్యూస్‌టుడే : బాలికపై బాలుడు అత్యాచారం చేశాడని 2వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఆంజనేయవాగు ప్రాంతానికి చెందిన బాలిక(16) 9వ తరగతి వరకు చదివి కరోనా కారణంగా ఇంటికే పరిమితమైంది. తల్లిదండ్రులు లేకపోవడంతో తాతయ్య వద్ద ఉంటోంది. వారు నివాసం ఉండే వీధిలో బాలుడు(16) బాలికను ప్రేమిస్తున్నానని చెప్పాడు. అందుకు ఆమె అంగీకరించలేదు. అయినా వెంటపడుతూ పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఆమెను నమ్మించాడు. దీంతో తరచూ ఇద్దరు ఫోన్‌లో మాట్లాడుకునేవారు. ఈ ఏడాది మే నెలలో బాలుడు ఆమెను ఇంటికి పిలిచాడు. బాలిక వెళ్లింది. ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోబోతున్నామంటూ బలవంతంగా బాలికను లొంగదీసుకున్నాడు. బాలిక శరీరాకృతిలో మార్పు రావడాన్ని ఆమె అక్క గుర్తించింది. ప్రశ్నించగా జరిగిన విషయాన్ని చెప్పింది. ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించగా బాలిక గర్భవతి అని తేలింది. బాలిక పెళ్లి చేసుకోమంటే పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నాడని, న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది. బాలిక తాతయ్య ఫిర్యాదు మేరకు అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ మోహన్‌రెడ్డి తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని