మహిళను కాపాడిన మెరైన్‌ పోలీస్‌
eenadu telugu news
Published : 19/10/2021 04:02 IST

మహిళను కాపాడిన మెరైన్‌ పోలీస్‌

మహిళను ఒడ్డుకు తీసుకొస్తున్న పోలీసు

పాలకాయతిప్ప(కోడూరు), న్యూస్‌టుడే: హంసలదీవిలోని సాగరసంగమం సమీపంలో సోమవారం ఒక మహిళ స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తూ సముద్రంలో మునిగిపోతుండగా మెరైన్‌ కానిస్టేబుల్‌ ఆమెను రక్షించడంతో సురక్షితంగా బయటపడింది. గుంటూరు జిల్లా రేపల్లె గ్రామానికి చెందిన నాలి నారాయణ తన కుటుంబ సభ్యులతో సోమవారం సాగరసంగమానికి స్నానాలకు వచ్చారు. డాల్ఫిన్‌ భవనం సమీపాన సముద్రపు అలల్లో స్నానాలకు దిగారు. ఈ క్రమంలో నాలి నారాయణ భార్య వెంకటేశ్వరమ్మ అలల ధాటికి నీటిలో పడి మునిగిపోతుండడాన్ని అక్కడే విధుల్లో ఉన్న మెరైన్‌ కానిస్టేబుల్‌ సంతోష్‌కుమార్‌ గమనించారు. వెంటనే నీటిలోకి దూకి ఆమెను అక్కడే ఉన్న మరికొంతమంది యువకుల సాయంతో ఒడ్డుకు చేర్చారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. మెరైన్‌ కానిస్టేబుల్‌ సంతోష్‌కుమార్‌ను మెరైన్‌ సీఐ వి.పవన్‌కిషోర్‌, ఎస్‌ఐ జిలాని, సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని