అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి ఏర్పాట్లు
eenadu telugu news
Published : 20/10/2021 04:45 IST

అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి ఏర్పాట్లు

రఘురామ్‌తో మాట్లాడుతున్న ఇన్‌ఛార్జి కలెక్టర్‌ మాధవీలత, సీపీ శ్రీనివాసులు

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: స్థానిక ఇందిరాగాంధీ నగరపాలక సంస్థ స్టేడియంలో ఈ నెల 21న నిర్వహించే పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమానికి ఏర్పాట్లను త్వరితగతిన పూర్తిచేసి సిద్ధం చేయాలని జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత, నగర పోలీసు కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు.. సంబంధిత అధికారులను ఆదేశించారు. స్టేడియంలో పనులను ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం తదితరులతో కలసి మంగళవారం వారు పరిశీలించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరై పోలీసు అమరవీరులకు నివాళులర్పిస్తారన్నారు. హోంశాఖా మంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్‌,  పలువురు మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొంటారన్నారు. కొవిడ్‌తో మృతిచెందిన పది మంది పోలీసు కుటుంబాల కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి చేతులమీదుగా ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు.  ఇన్‌ఛార్జి కలెక్టర్‌ మాధవీలత మాట్లాడుతూ అన్ని ప్రభుత్వశాఖల అధికారులు సమష్టి కృషితో  బుధవారం సాయంత్రానికి పనులు పూర్తి చేయాలని సూచించారు. ఏసీపీ హర్షవర్థన్‌, సబ్‌ కలెక్టర్‌ ఎస్‌ఎస్‌ ప్రవీణ్‌చంద్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని