వేర్వేరు ఘటనల్లో ఇద్దరి బలవన్మరణం
eenadu telugu news
Published : 20/10/2021 04:45 IST

వేర్వేరు ఘటనల్లో ఇద్దరి బలవన్మరణం

భవానీపురం, న్యూస్‌టుడే : వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు వ్యక్తులు బలవన్మరణం పొందారు.  అనారోగ్యంతో బాధపడుతూ మనస్తాపంతో ఆటో డ్రైవర్‌, భార్య పుట్టింటికి వెళ్లిందని పారిశుద్ధ్య కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నారు. భవానీపురం పోలీసుల వివరాల ప్రకారం.. గొల్లపూడి శ్రీనివాసనగర్‌లో నివాసం ఉండే దొంతరబోయిన గోవింద్‌(42) ట్రక్‌ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. గత ఐదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కొన్నాళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. ఇరవై రోజుల కిందట రైల్వేట్రాక్‌ వద్దకు వెళ్లి ఆత్మహత్యాయత్యానికి పాల్పడగా కుమారుడు తీసుకొచ్చాడు. ఈ నెల 19న ఇంట్లోని గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. కుటుంబసభ్యులు తలుపు తెరిచి చూడగా వేలాడుతూ కనిపించాడు. కిందకు దింపి చూడగా చనిపోయాడు. భవానీపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.


చిట్టినగర్‌లో పారిశుద్ధ్య కార్మికుడు..

చిట్టినగర్‌, న్యూస్‌టుడే : పారిశుద్ధ్య కార్మికుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం.. వైఎస్‌ఆర్‌ కాలనీ బ్లాక్‌ నంబరు 103లో దాసరి కోటయ్య, మరియ దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి 20 ఏళ్ల కిందట వివాహమైంది. ముగ్గురు సంతానం. కోటయ్య నగరపాలకసంస్థ పారిశుద్ధ్య విభాగంలో కాంట్రాక్టు పద్ధతిలో రోడ్లు ఊడ్చే పని చేస్తాడు. మద్యానికి బానిసై కుటుంబ పోషణ పట్టించుకోకుండా ఇబ్బంది పెడుతున్నాడు. 15 రోజుల నుంచి పనికి కూడా వెళ్లడం లేదు. ఇంట్లో వస్తువులు తాకట్టుపెట్టి మద్యం తాగుతున్నాడు. ఈ నేపథ్యంలో దంపతుల మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. 5 రోజుల కిందట భార్య తన పిల్లలను తీసుకుని వాంబే కాలనీలోని పుట్టింటికి వెళ్లింది. మనస్తాపం చెందిన కోటయ్య ఈ నెల 18న రాత్రి ఫ్యాన్‌కి చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటి పక్కన వారు చూసి భార్యకు సమాచారం అందించారు. వచ్చి చూస్తే అప్పటికే మృతి చెందాడు. 2వ పట్టణ పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని శవపంచనామా నిర్వహించారు. మృతదేహానికి ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని