ఇండిపెండెంట్‌ చర్చిల బిషప్‌గా రత్నబాబు
eenadu telugu news
Published : 20/10/2021 04:45 IST

ఇండిపెండెంట్‌ చర్చిల బిషప్‌గా రత్నబాబు

బిషప్‌ రత్నబాబును సత్కరిస్తున్న పాస్టర్లు

హనుమాన్‌జంక్షన్‌, న్యూస్‌టుడే: ఆల్‌ ఇండియా ఇండిపెండెంట్‌ చర్చిల డయాసిస్‌ కృష్ణా జిల్లా బిషప్‌గా బాపులపాడు మండలం కానుమోలుకు చెందిన ఆత్మలభారం మినిస్ట్రీస్‌ చర్చి పాస్టర్‌ పులవర్తి రత్నబాబు నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం విజయవాడలో ఆయన పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. దైవ సేవతో పాటు మానవ సేవతో రత్నబాబు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని పలువురు పాస్టర్లు కొనియాడి సత్కరించారు. బిషప్‌లు డా.సంజయ్‌ ఆనంద్‌, డా.జోసఫ్‌ కేకే, విక్టర్‌, ఎన్డీ సునీల్‌, తదితర పాస్టర్లు, విశ్వాసులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని