ఆస్తి కోసమే హత్య
eenadu telugu news
Published : 20/10/2021 04:45 IST

ఆస్తి కోసమే హత్య

వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ శ్రీనివాసులు

మైలవరం, న్యూస్‌టుడే: భార్య పేరిట ఉన్న ఆస్తిని అమ్ముకోవడానికి అడ్డు వస్తున్నారనే కక్షతోనే కొలుసు కొండలరావును అతని అల్లుడే హత్య చేసినట్లు నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో హత్య ఘటన, నిందితుడి అరెస్టు వివరాలను విలేకరుల సమావేశంలో తెలియజేశారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. గన్నవరం మండలం బల్లిపర్రుకు చెందిన వీర్ల రాంబాబుతో నాలుగేళ్ల కిందట ఎదురుబీడేనికి చెందిన ధనలక్ష్మితో వివాహమైంది. తనకు కట్నం కింద ఇచ్చిన పొలాన్ని అమ్మాలని భార్యపై భర్త ఒత్తిడి తీసుకొస్తుండగా.. అందుకు ఆమెతోపాటు ఆమె కుటుంబ సభ్యులు నిరాకరిస్తున్నారు. ఈక్రమంలో గత ఆదివారం పిల్లల్ని తీసుకుని ఆమె పుట్టింటికి రాగా.. ప్రణాళిక ప్రకారం సోమవారం తెల్లవారుజామున కత్తి తీసుకుని నిద్రిస్తున్న మామ ఇతర కుటుంబ సభ్యులపై రాంబాబు విచక్షణా రహితంగా దాడిచేశాడు. కొండలరావు ఆస్పత్రిలో మృతిచెందగా.. మిగిలిన ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిందితుడికి కోసం ప్రత్యేక బృందాలతో గాలించి, మంగళవారం మధ్యాహ్నం గన్నవరం మండలం తెంపల్లిలో పోలవరం కాలువ వద్ద అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. దర్యాప్తులో సీఐ పి.శ్రీను, మైలవరం, జి.కొండూరు, ఎ.కొండూరు, వీరవల్లి ఎస్సైలు రాంబాబు, ధర్మరాజు, శ్రీనివాస్‌, సుబ్రహ్మణ్యం ఇతర సిబ్బంది పాల్గొన్నారు. నిందితుడిని 24 గంటల వ్యవధిలోనే పట్టుకోవడంతో దర్యాప్తులో పాల్గొన్న వారి పేర్లను రివార్డుల నిమిత్తం సిఫార్సు చేస్తున్నట్లు పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని