ఊడిపడిన లారీ చక్రం.. ఒకరి దుర్మణం
eenadu telugu news
Published : 20/10/2021 04:45 IST

ఊడిపడిన లారీ చక్రం.. ఒకరి దుర్మణం

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: వేగంగా వెళుతున్న లారీ నుంచి ఊడిపడిన టైరు తగిలి ఒకరు మృతి చెందిన ఘటన ఉంగుటూరు మండలం తేలప్రోలు వద్ద చెన్నై-కోల్‌కత జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఏలూరు వైపు నుంచి విజయవాడ వెళ్తున్న 10 టైర్ల లారీకి చెందిన ఓ టైరు స్థానిక ఉషారామా ఇంజినీరింగ్‌ కళాశాల సమీపంలోకి రాగానే ఊడిపోయి రోడ్డుకు అవతలి వైపుగా విజయవాడ నుంచి జంక్షన్‌ వైపునకు వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడ్ని ఢీకొంది. దీంతో తీవ్ర గాయాలైన అతడిని అంబులెన్స్‌ సాయంతో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు హనుమాన్‌జంక్షన్‌కు చెందిన వడ్లమాను రాంబాబు(33)గా పోలీసులు గుర్తించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని