కేవీఆర్‌ కాలనీలో వైద్య శిబిరం
eenadu telugu news
Published : 20/10/2021 04:45 IST

కేవీఆర్‌ కాలనీలో వైద్య శిబిరం

శిబిరంలో రోగుల వివరాలు పరిశీలిస్తున్న డీఎంహెచ్‌వో సుహాసిని

ఎనికేపాడు(నిడమానూరు), న్యూస్‌టుడే: విజయవాడ శివారు ఎనికేపాడు కేవీఆర్‌ కాలనీలో డయేరియా అదుపులోనే ఉందని జిల్లా వైద్యాధికారిణి ఎం.సుహాసిని తెలిపారు. ‘కేవీఆర్‌ కాలనీకి ఏమైంది’ శీర్షికన మంగళవారం ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన ఆమె.. అంటువ్యాధుల బృందంతో కలిసి ఆ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ స్థానిక సాయిబాబా మందిరం వద్ద వైద్య శిబిరం ఏర్పాటు చేశామన్నారు. వ్యాధి పూర్తిగా నియంత్రణలోకి వచ్చే వరకు శిబిరం కొనసాగుతుందన్నారు. గత నాలుగు రోజుల్లో ఈ వ్యాధి బారిన పడినవారు పూర్తిగా కోలుకున్నారని తెలిపారు. ఈ ప్రాంతంలో ప్రజలు తాగుతున్న నీటి నమూనాలు సేకరించి స్వచ్ఛతా పరీక్ష కేంద్రాలకు పంపించామన్నారు. ఫలితాలు రాగానే అంటువ్యాధుల నిపుణుల బృందం.. కారణాలు పరిశీలించి నివేదిక రూపొందిస్తుందని తెలిపారు. ప్రజలు తమ ఇంటి పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చేంత వరకు వేడి ఆహార పదార్థాలు, శాఖాహారం మాత్రమే తీసుకోవాలన్నారు. జిల్లా అంటువ్యాధుల బృందం అధికారులు పి.సుకుమార్‌, రామకృష్ణ, అద్దంకి శ్రీనివాసరావు, ఖాసీం, బూర రాజశేఖర్‌, ఉప్పులూరు పీహెచ్‌సీ వైద్యులు సుందర్‌ కుమార్‌, పావని, ఎపడమాలజిస్టు శ్రుతి మౌనిక, సర్పంచి పూర్ణచంద్రరావు, పంచాయతీ కార్యదర్శి కృపాకుమార్‌, ఈవోఆర్‌డీ శేషగిరిరావు కాలనీని పరిశీలించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని