క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు సీఎం కృషి
eenadu telugu news
Published : 21/10/2021 03:42 IST

క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు సీఎం కృషి

చెత్త సేకరణ వాహనాలను జెండా ఊపి ప్రారంభిస్తున్న హోంమంత్రి

సుచరిత, చిత్రంలో ఎమ్మెల్యేలు గిరిధర్‌, ముస్తఫా, ఎమ్మెల్సీ కల్పలత,

ఎంపీలు వెంకటరమణారావు, అయోధ్యరామిరెడ్డి, కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: రాష్ట్రాన్ని క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని హోంమంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అర్బన్‌ పరిధిలో క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌, గ్రామీణ ప్రాంతాల్లో జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. చెత్తసేకరణకు ప్రతీ ఇంటి నుంచి రోజుకు రూ.2 చొప్పున 585 గ్రామాల్లోని కుటుంబాల నుంచి రూ.162 కోట్ల ఆదాయ సేకరణ జరుగుతుందన్నారు. వాటితో గ్రామాలను అభివృద్ధి చేసుకోవడానికి వీలుంటుందని తెలిపారు. చెత్తను కాల్చివేసేందుకు 709 పరికరాలను, 98 ఫాగింగ్‌ యంత్రాలు, అధిక పీడన టాయిలెట్‌ క్లీనర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. తొలుత రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి జగనన్న స్వచ్ఛ సంకల్పం ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు, ఎమ్మెల్సీ కల్పలత, ఎమ్మెల్యేలు మద్దాళి గిరిధర్‌రావు, ముస్తఫా, మిర్చియార్డు ఛైర్మన్‌ చంద్రగిరి యేసురత్నం, మేయర్‌ మనోహర్‌నాయుడు, డిప్యూటీ మేయర్‌ సజీల, జేసీలు ఏఎస్‌ దినేష్‌కుమార్‌, జి.రాజకుమారి, కె.శ్రీధర్‌రెడ్డి, డీపీవో కేశవరెడ్డి పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని