నేటి నుంచి ‘మెగా క్విజ్‌-2021’
eenadu telugu news
Published : 21/10/2021 03:42 IST

నేటి నుంచి ‘మెగా క్విజ్‌-2021’

వివరాలు వెల్లడిస్తున్న బజరంగ్‌ ఫౌండేషన్‌ సీఈవో అంబటి మురళీకృష్ణ

లాడ్జిసెంటర్‌, న్యూస్‌టుడే : విద్యార్థుల్లో విజ్ఞాన వికాసానికి తోడ్పడేలా మెగా క్విజ్‌-2021 నిర్వహిస్తున్నట్లు బజరంగ్‌ ఫౌండేషన్‌ సీఈఓ అంబటి మురళీకృష్ణ తెలిపారు. ఈనెల 21 నుంచి ప్రారంభమయ్యే కార్యక్రమం గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో సుమారు 45 రోజుల పాటు 150 కళాశాలల్లో జరుగుతుందన్నారు. నగరంలోని ఫౌండేషన్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మురళీకృష్ణ మాట్లాడుతూ గుంటూరు కేంద్రంగా పనిచేస్తున్న తమ సంస్థ సామాజిక బాధ్యతలో భాగంగా విద్యార్థుల్లో జ్ఞాన పిపాసను పెంపొందించే దిశగా రెండు జిల్లాల్లోని గ్రాడ్యుయేట్‌ డిగ్రీ/బిటెక్‌/మెడిసిన్‌/ ఫార్మసీ /బీఎస్సీ/బీకామ్‌ తదితర కోర్సులు చదివే విద్యార్థులకు క్విజ్‌ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోటీలు మూడు దశల్లో జరుగుతాయన్నారు. విజేతలకు ప్రథమ బహుమతిగా రూ.1,11,111, ద్వితీయ బహుమతిగా రూ.55,555, తృతీయ బహుమతిగా రూ.25,555 అందజేస్తామన్నారు. కార్యక్రమంలో ఫౌండేషన్‌ డైరెక్టర్లు జి.సుబ్బారావు, ఎస్‌.సమీర్‌ నందన్‌, ప్రాజెక్ట్‌ మేనేజర్‌ సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని