పోలీసులు అసభ్యకరంగా ప్రవర్తించారు
eenadu telugu news
Published : 21/10/2021 03:42 IST

పోలీసులు అసభ్యకరంగా ప్రవర్తించారు

తెలుగు మహిళ నేత రాణి

పట్టాభిపురం(గుంటూరు), న్యూస్‌టుడే: తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఇంటికి వెళ్లి వస్తున్న తమ పట్ల పోలీసులు అసభ్యకరంగా ప్రవర్తించి అవమానకరంగా నోటికొచ్చినట్లు బూతులు తిట్టారని తెలుగు మహిళ అధికార ప్రతినిధి వేగుంట రాణి విమర్శించారు. గుంటూరు జీజీహెచ్‌ వద్ద ఆమె బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ‘ఉదయాన్నే అప్పటికి ఇంకా బంద్‌ కూడా ప్రారంభం కాలేదు. పోలీసులు అక్కడ తనతో పాటు ఉపాధ్యక్షురాలు ఆషా, అధికార ప్రతినిధి శిరీషను అదుపులోకి తీసుకుని వ్యాన్‌లో ఎక్కించారు. చిలకలూరిపేట రోడ్డుపై తీసుకువెళ్లి.. ఆ తర్వాత నరసరావుపేట రోడ్డు వైపు తీసుకువెళ్లారు. అక్కడ మేడికొండూరు సీఐకు అప్పగించారు. ఆయన నోటికి వచ్చిన విధంగా అసభ్య పదజాలంతో దూషించారు. పిడిగుద్దులు గుద్దారు. దీంతో ఆషా స్పృహ కోల్పోయారు. ఆటోలో ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చి చికిత్స చేయించాను. నా చీర చించివేసి అవమానకరంగా వ్యవహరించారు. సెల్‌ఫోన్లు గుంజుకున్నారు. మహిళల పట్ల అసభ్యక్రంగా ప్రవర్తించిన మేడికొండూరు సీఐపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. దిశ చట్టం తీసుకువచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న హోంమంత్రి సుచరిత సాటి మహిళల పట్ల సీఐ ఇంత దారుణంగా వ్యవహరిస్తుంటే ఏం చేస్తున్నారు? సీఐపై చర్యలు తీసుకోకపోతే మహిళా సంఘాలను కూడగట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతాం’.. అని హెచ్చరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని