పోలీసుల బాధ్యతల్లో కండక్టర్లు
eenadu telugu news
Published : 21/10/2021 03:42 IST

పోలీసుల బాధ్యతల్లో కండక్టర్లు

తెలుగుదేశం ఇచ్చిన రాష్ట్ర బంద్‌ పిలుపులో భాగంగా బుధవారం తెల్లవారుజామున గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఆ పార్టీ నాయకులు ఆందోళన చేశారు. ఆందోళనలో తెదేపా మహిళా నాయకురాలు కొఠారు సంధ్యారాణి పాల్గొన్నారు. నిరసనకారులను అరెస్టు చేసే క్రమంలో మహిళా పోలీసులు లేకపోవడంతో సంధ్యారాణిని అదుపులోకి తీసుకొని వాహనంలోకి ఎక్కించే బాధ్యతను పోలీసు అధికారులు మహిళా కండక్టర్లకు అప్పగించారు. దీంతో వారు బస్టాండ్‌ ప్రవేశద్వారం వద్ద నేలపై కూర్చున్న సంధ్యారాణిని లాగి పోలీసు వాహనంలోకి ఎక్కించారు. అదే ఈ దృశ్యం.

-న్యూస్‌టుడే, సత్తెనపల్లి


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని