తీరు మార్చుకోని చంద్రబాబు : మంత్రి వెలంపల్లి
eenadu telugu news
Published : 21/10/2021 03:42 IST

తీరు మార్చుకోని చంద్రబాబు : మంత్రి వెలంపల్లి

విజయవాడ వన్‌టౌన్‌, న్యూస్‌టుడే : ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పినా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరు మారలేదని మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. సీఎం జగన్‌పై తెదేపా నాయకుల వ్యాఖ్యలను ఖండిస్తూ బుధవారం పాతబస్తీ పంజాసెంటర్‌లో వైకాపా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటాన్ని అవమానించారు. మంత్రి వెలంపల్లి మాట్లాడుతూ.. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి చంద్రబాబు ద్వేషంతో వ్యవహరిస్తున్నారన్నారు. పట్టాభి మాటలను చంద్రబాబు, లోకేష్‌లు సమర్థిస్తారా? అంటూ ప్రశ్నించారు. కార్యక్రమంలో నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని