దుర్గా ఘాట్‌లో నవహారతులు పునఃప్రారంభం
eenadu telugu news
Published : 21/10/2021 03:54 IST

దుర్గా ఘాట్‌లో నవహారతులు పునఃప్రారంభం

కృష్ణమ్మకు హారతులు ఇస్తున్న రుత్వికులు

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో కృష్ణమ్మ నదీ హారతులను బుధవారం పునరుద్ధరించారు. ఆలయ ఈఓ భ్రమరాంబతో స్థానాచార్య శివప్రసాదశర్మ దుర్గాఘాట్‌లో కృష్ణవేణిమాతకు పూజ చేయించారు. కొవిడ్‌ కారణంగా కృష్ణమ్మ నదీహారతులను దుర్గాఘాట్‌లో నిలిపివేశారు. కరోనా పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో హారతులను పునరుద్ధరించినట్లు ఈఓ తెలిపారు. కృష్ణవేణికి శాస్త్రోకంగా పూజా ద్రవ్యాలను సమర్పించిన అనంతరం రుత్వికులు లాంఛనంగా నవహారతులను ప్రారంభించారు. వరుసగా ఓంకారం, నాగ, సూర్య, చంద్ర, పంచ, నంది, సింహ, కుంభ, నక్షత్ర హారతులను భక్తుల సమక్షంలో సమర్పించారు. వైదిక కమిటీ సభ్యులు శ్రీనివాసశాస్త్రి, కోట ప్రసాద్‌, షణ్ముఖశాస్త్రి పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని