32,697 మంది చిరు వ్యాపారులకు లబ్ధి
eenadu telugu news
Published : 21/10/2021 03:54 IST

32,697 మంది చిరు వ్యాపారులకు లబ్ధి

లబ్ధిదారులకు చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, దూలం నాగేశ్వరరావు,

మేకా ప్రతాప్‌, ఎమ్మెల్సీ కరీమున్నీసా, మేయర్‌ భాగ్యలక్ష్మి, కలెక్టర్‌ నివాస్‌

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : జగనన్న తోడు పథకం కింద జిల్లాలోని 32,697 మంది చిరు వ్యాపారులకు రూ.1.15 కోట్ల వడ్డీ రాయితీని బుధవారం జమ చేశారు. ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించగా, నగరంలోని కలెక్టర్‌ విడిది కార్యాలయంలో జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహించారు. వడ్డీ రాయితీ జమ చెక్కును లబ్ధిదారులకు అందజేశారు. విజయవాడ మధ్య నగర, కైకలూరు, నూజివీడు ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, దూలం నాగేశ్వరరావు, మేకా వెంకట ప్రతాప అప్పారావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. కలెక్టర్‌ జె.నివాస్‌ మాట్లాడుతూ.. డీఆర్డీఏ ద్వారా 30,116 మందికి రూ.1,05,61,640, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) పరిధిలో 1,332 మందికి రూ.5,28,986, వీఎంసీ ద్వారా 1,249 మందికి రూ.4,69,951.. వెరసి 32,697 మందికి రూ.1,15,60,577ల వడ్డీ రాయితీ ప్రయోజనం కలిగినట్లు వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎండీ కరీమున్నీసా, విజయవాడ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, విశ్వబ్రాహ్మణ, గౌడ, వడ్డెర కార్పొరేషన్ల ఛైర్మన్లు తోలేటి శ్రీకాంత్‌, మాదు శివరామకృష్ణ, సైదు గాయత్రి, డీఆర్డీఏ, మెప్మా పీడీలు జె.సునీత, ఎం.రమాదేవి పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని