దుర్గమ్మకు రూ.50 లక్షల విలువైన వజ్రాల హారం
eenadu telugu news
Published : 21/10/2021 03:54 IST

దుర్గమ్మకు రూ.50 లక్షల విలువైన వజ్రాల హారం

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే : ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మకు దసరా ఉత్సవాల్లో అజ్ఞాత భక్తుడు రూ.50 లక్షల విలువైన వజ్రాల హారాన్ని అందజేశారు. విరాళం ఇచ్చిన విషయం ప్రకటించొద్దని దాత సూచించడంతో అధికారులు విషయాన్ని గోప్యంగా ఉంచారు. వజ్రాలు పొదిగిన బంగారు హారాన్ని అమ్మవారికి ప్రతి శుక్రవారం అలంకరించాలని దాత కుటుంబం సూచించింది. పౌర్ణమి రోజున సంపూర్ణ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా అమ్మవారిని అలంకరించడంతో వజ్రాల హారాన్ని అమ్మవారి ఎదుట బుధవారం ఉంచి పూజ నిర్వహించారు. స్వర్ణాభరణాలతో కనకదుర్గగా పేరుగాంచిన అమ్మవారిని అత్యధిక సంఖ్యలో భక్తులు శుక్రవారం దర్శించుకుంటారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని