‘దేశ ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యం’
eenadu telugu news
Published : 22/10/2021 05:37 IST

‘దేశ ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యం’


మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, వేదికపై అజయ్‌కుమార్‌ తదితరులు

లాడ్జిసెంటర్‌, న్యూస్‌టుడే : కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో దేశ ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యమైందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు పేర్కొన్నారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో జిల్లాలోని శాఖ కార్యదర్శులు, సమితి సభ్యుల వర్క్‌షాప్‌ నిర్వహించారు. దీనికి హాజరైన ముప్పాళ్ల మాట్లాడుతూ దేశంలో అవినీతిని అంతమొందిస్తామని, విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తీసుకువచ్చి అర్హత కలిగిన కుటుంబాలకు అందజేస్తామని మోస పూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన మోదీ నిత్యావసర ధరలను పెంచి సామాన్యుల నడ్డివిరుస్తున్నారని మండిపడ్డారు. 32 మంది ప్రాణాలు బలిదానం చేసి సాధించుకున్న విశాఖ ఉక్కును, ప్రభుత్వ రంగ సంస్థలను అప్పణంగా కార్పొరేట్‌ సంస్థలకు అప్పగిస్తున్నారన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత పారిశ్రామిక రంగం నిర్వీర్యమైందన్నారు. నగర కార్యదర్శి కోట మాల్యాద్రి అధ్యక్షత జరిగిన వర్క్‌షాప్‌లో ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వి.రాధాకృష్ణ మూర్తి తదితరులు పాల్గొన్నారు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని