భవన నిర్మాణాలు వేగవంతం చేయండి
eenadu telugu news
Published : 22/10/2021 05:37 IST

భవన నిర్మాణాలు వేగవంతం చేయండి


మాట్లాడుతున్న కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: ప్రభుత్వ భవనాల నిర్మాణాలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో గురువారం అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అన్ని భవనాల బేస్‌మెంట్‌ స్థాయికి తీసుకురావాలన్నారు. టిడ్కో గృహాల లబ్ధిదారులందరు వారి వాటాను వెంటనే చెల్లించేలా మెప్మా, మున్సిపల్‌ అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న వాలంటీర్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. పేదలందరికీ ఇళ్ల పథకం లబ్ధిదారులందరినీ డ్వాక్రా సంఘాల్లో చేర్పించేలా చూడాలన్నారు. సమావేశంలో డీఆర్‌వో పి.కొండయ్య, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ బ్రహ్మయ్య, డ్వామా పీడీ శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ జేడీ విజయభారతి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని