డిసెంబరు 31 నాటికి సచివాలయ భవనాల పూర్తి
eenadu telugu news
Published : 22/10/2021 05:37 IST

డిసెంబరు 31 నాటికి సచివాలయ భవనాల పూర్తి

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి విడిది కార్యాలయం నుంచి గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ (వీసీ) నిర్వహించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, గృహాలు, సచివాలయ, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌ల భవనాల నిర్మాణాలు, ప్రస్తుత ఖరీఫ్‌, రాబోవు రబీ పంటలు తదితరాలపై సమీక్షించారు. నగరంలోని విడిది కార్యాలయం నుంచి కలెక్టర్‌ జె.నివాస్‌ హాజరై, జిల్లాలోని పరిస్థితులను వివరించారు. 809 గ్రామ సచివాలయ భవనాల నిర్మాణ పనులను డిసెంబరు 31 నాటికి పూర్తి చేయనున్నట్టు తెలిపారు. బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ కేంద్రాల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టిసారిచినట్లు పేర్కొన్నారు. రైతు భరోసా కేంద్రాలు, హైల్త్‌ క్లినిక్‌, డిజిటల్‌ లైబ్రరీలు వంటి నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయనున్నట్టు వివరించారు. జేసీలు కె.మాధవీలత, శ్రీవాస్‌ నుపూర్‌ అజయ్‌కుమార్‌, మోహన్‌కుమార్‌, వీఎంసీ కమిషనర్‌ వి.ప్రసన్న వెంకటేష్‌, జేడీఏ టి.మోహనరావు, గృహ నిర్మాణ సంస్థ పీడీ రామచంద్రన్‌ పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని