అప్పులబాధతో యువ రైతు ఆత్మహత్య
eenadu telugu news
Published : 22/10/2021 05:37 IST

అప్పులబాధతో యువ రైతు ఆత్మహత్య

కాకిరాల (దుర్గి), న్యూస్‌టుడే : మండల పరిధిలోని కాకిరాలలో అప్పుల బాధతో గొర్రెపాటి శేషయ్య (29) అనే యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. తనకున్న ఎకరం పొలంతో పాటు మరికొంత పొలం కౌలుకు తీసుకుని సాగు చేశాడు. పంటకు గిట్టుబాటు ధర రాలేదు. దీనికితోడు పొలంలో నీటి కోసం ఐదుకు పైగా బోరు బావులు వేసినా నీరు చుక్కనీరు పడలేదు. ఇవన్నీ కలిపి అప్పులు రూ.10 లక్షలు అయ్యాయి. అప్పు తీర్చేందుకు దారి లేక బుధవారం పొలంలో పురుగు మందు తాగగా గుర్తించిన స్థానికులు నరసరావుపేటలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. భార్య అనురాధ ఫిర్యాదు మేరకు ఎస్సై కేపీ రవీంద్ర కేసు నమోదు చేశారు. మృతునికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని